Bhatti Vikramarka Fires on KCR : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య సయోధ్యతో ఇది మరోసారి రుజువైందని విమర్శించారు. నిరంకుశ నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్య గొంతుకను అణచివేస్తున్న మోదీ, కేసీఆర్‌ను.. వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నల్గొండలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిన్నటితో అది కాస్తా రుజువైంది : ఈ క్రమంలోనే భారత్ రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ రెండు ఒకటేనని.. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ముందు నుంచే చెబుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. నిన్నటితో అది కాస్తా రుజువైందని దుయ్యబట్టారు. మరోవైపు శాసనసభ బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కేసీఆర్ ఎప్పుడు గవర్నర్‌తో కలిసి మాట్లాడటం కానీ, ఎదురుపడటానికి ఇష్టపడలేదని గుర్తు చేశారు. దీనిపై తెలంగాణ సమాజానికి.. ముఖ్యమంత్రి గురించి సంపూర్ణంగా అర్థమైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Bhatti Peoples March Padayatra in Nalgonda : పదేళ్లలో ధరణితో భూ కుంభకోణం, ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ అక్రమాలు.. భూముల అమ్మకాల్లో అవినీతి, కాళేశ్వరం, మద్యం గోల్‌మాల్‌పై మాట్లాడిన ప్రధాని చర్యలెందుకు తీసుకోవడం లేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాటలకే ఎందుకు పరితమయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే కేసీఆర్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందన్న బీజేపీ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇదే విషయం తెలంగాణ సమాజానికి అర్థం కావడంతో ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.
"బీఆర్‌ఎస్ , బీజేపీలు రెండు ఒకటే. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే చెబుతుంది. నిన్నటితో అది రుజువైంది. ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. నువ్వు కొట్టినట్టు, తిట్టినట్టు చెయ్యి.. నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్లు ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు గవర్నర్‌తో కేసీఆర్ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సయోధ్య కుదుర్చుకొని గవర్నర్‌తో కలిసిపోయారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ గురించి సంపూర్ణంగా అర్థమైంది. నిరంకుశ నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్య గొంతుకను అణచివేస్తున్న మోదీ, కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందన్న బీజేపీ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చదవండి: Bhatti Vikramarka on KCR : 'కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు'
Bhatti Padayatra Updates : "కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలి"