నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో పేదల కోసం తెలంగాణ సర్కార్ రెండు పడకగదుల ఇళ్లను కేటాయించింది. డ్రా ద్వారా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులకు సరిపడా ఇళ్లు లేకపోవడం వల్ల ఎంపికను కొందరు గ్రామస్థులు తిరస్కరించారు. పునఃపరిశీలిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని వారు వాపోయారు. తమ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
చేసేదేంలేక గతంలో డ్రా ద్వారా ఎంపికైన లబ్దిదారులు తమకు కేటాయించిన ఇళ్లలోకి ప్రవేశించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గృహాలను ఖాళీ చేయాలని ఆదేశించగా కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము ఖాళీ చేయమని లబ్ధిదారులు తేల్చి చెప్పారు.