సాగర్ ఉప ఎన్నికల్లో.. తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గుర్రంపోడ్ మండలంలోని కల్వలపల్లి, శాకాజీపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాపీ పట్టి.. ఓటర్లను అభ్యర్ధించారు.
తెరాస ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని ఎమ్మెల్యే.. ఓటర్లకు సూచించారు. ప్రచారంలో.. జడ్పీటీసీ గాలి రవికుమార్, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్‌తో పాటు.. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా బారినపడి హెడ్ కానిస్టేబుల్ మృతి