ETV Bharat / state

ఊపందుకున్న 'మునుగోడు' రాజకీయం.. ఇంటింటికీ పార్టీల ప్రచారం..!

Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో తెరాసతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి.

Munugode By Election
మునుగోడు ఉపఎన్నిక
author img

By

Published : Sep 2, 2022, 7:04 AM IST

Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో అధికార తెరాసతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ గురువారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించింది.

ఇప్పటికే మండలాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జులు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మునుగోడులో జరిగే కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, మధుయాస్కీతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏ మేరకు హాజరవుతారోననే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. మరోవైపు టిక్కెట్‌ ఆశావహులు కొన్నాళ్ల నుంచే మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతివ్వాలని కోరుతున్నారు. పార్టీ టిక్కెట్‌ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే పీసీసీ సమగ్ర సమాచారాన్ని ఏఐసీసీకి నివేదించింది. మరో వారం, పది రోజుల్లో అభ్యర్థి ప్రకటన వచ్చే అవకాశముందని మాజీ మంత్రి ఒకరు వెల్లడించారు.

సంక్షేమ పథకాలతో ముందుకు: రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అధికార తెరాస.. మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలుపునకు కార్యాచరణపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. గత ఎనిమిదేళ్లలో మునుగోడు నియోజకవర్గానికి సంక్షేమ పథకాల ద్వారా కలిగిన లబ్ధితో పాటు ఫ్లోరైడ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఆ పార్టీ నేతలు ప్రతి సమావేశంలోనూ కార్యకర్తలకు వివరిస్తున్నారు.

క్షేత్రస్థాయి ప్రచారంలో భాగంగా వీటిన్నింటినీ ప్రజలకు చెప్పాలని వారు క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు పురపాలికలకు ఇన్‌ఛార్జులుగా నియమించడంతో వారు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని అధిష్ఠానానికి నివేదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు నిఘావర్గాలు, ప్రైవేటు సంస్థలతో చేసే సర్వే నివేదికలపైనా అధికార పార్టీ తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

నోటిఫికేషన్‌ విడుదల అయ్యాకే పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్న దృష్ట్యా అప్పటి వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నాయకులకు స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో నియోజకవర్గంలో ఉన్న వారందరినీ కలుపుకొని పోయేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇంటింటి ప్రచారం నిర్వహించేలా మండలాల వారీగా ఉన్న ఇన్‌ఛార్జులు షెడ్యూల్‌ రూపొందించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో నోటిఫికేషన్‌కు ముందే అన్ని పార్టీలు ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నాయి.

రానున్న భాజపా అగ్ర నాయకులు: మునుగోడు కార్యక్షేత్రంలోకి భాజపా అగ్రనాయకులు రానున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయాలనే పార్టీ కేంద్ర కమిటీ సూచనల మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మండలాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇతర పార్టీల్లో నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు.

తాజాగా తెరాసలో నుంచి చండూరు మాజీ సర్పంచి కోడి గిరిబాబు భాజపాలో చేరడం గమనార్హం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌, తెరాస నాయకులు తమ పార్టీలో చేరేలా వ్యూహం రచించడం, పాత క్యాడర్‌ను కొత్త వారితో సమన్వయం చేసేలా ఆయన ముందుకెళుతున్నారు. గత నెల 21న జరిగిన అమిత్‌షా బహిరంగ సభ విజయవంతం కావడంతో ఈ నెలాఖరులో మరో భారీ బహిరంగ సభను చండూరు వేదికగా నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి లేదంటే భాజపా జాతీయ అధ్యక్షుడు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:మునుగోడు ఉపఎన్నికలో తెరాసకే మా మద్దతు: తమ్మినేని వీరభద్రం

మునుగోడు ప్రచారానికి ముహుర్తం ఖరారు.. హస్తం నేతల్లో హుషారు...

'భార్య అనే పదానికి.. నేటి యువత అర్థం మార్చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.