ETV Bharat / state

రైతులను లాభాల బాట పట్టిస్తోన్న 'మెట్ట వ్యవసాయం'

వరి సాగు చేయాలంటే నారు పోసి, మడుల్లో నీరు నింపి దమ్ము చేసిన తర్వాత బురదలో నాటు వేయాలి. ఇందుకు నీటి వినియోగంతో పాటు పెట్టుబడీ ఎక్కువే. అయితే.. ఈ ఖర్చులను తగ్గించి పర్యావరణహితంగా మెట్ట పద్ధతిలో వరి సాగును ప్రోత్సహిస్తోంది డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.

రైతులను లాభాల బాట పట్టిస్తోన్న 'మెట్ట వ్యవసాయం'
రైతులను లాభాల బాట పట్టిస్తోన్న 'మెట్ట వ్యవసాయం'
author img

By

Published : Jun 7, 2022, 5:07 PM IST

రైతులను లాభాల బాట పట్టిస్తోన్న 'మెట్ట వ్యవసాయం'

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మెట్ట పద్ధతిలో వ్యవసాయం రైతులను లాభాల బాట పట్టిస్తోంది. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిలో భూమి చదును చేసి తొలకరి ప్రారంభం తర్వాత ట్రాక్టర్‌ వెనుక మల్టి క్రాప్‌ ప్లాంటర్‌ యంత్రం సాయంతో భూమిలో విత్తనాలు వేసి వరిని పండిస్తారు. ఫలితంగా కూలీల ఖర్చు సహా ఇతరత్రా వ్యయాలు భారీగా తగ్గుతున్నాయి. అంతేకాదు ఎలాంటి రసాయనాలు వాడాలనే విషయంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. గత వానాకాలం సీజన్‌లో త్రిపురారం మండలంలో 380 ఎకరాల్లో సాగు చేశారు. మంచి ఫలితాలు రావడంతో పది మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో మెట్ట పద్ధతిలో సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతులు, భూముల ఎంపిక, విత్తనాల సరఫరాను పూర్తి చేశారు.

మెుదట్లో కొంతమంది రైతులే..: ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సభ్యులు మెట్ట పద్ధతిలో వరి సాగును ప్రోత్సహిస్తున్నారు. మెుదట్లో కొంతమంది రైతులే ముందుకు వచ్చారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్లు అదనపు దిగుబడులు రావడంతో.. ఈ ఏడాది చాలా మంది రైతులు ముందుకు వచ్చారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ దఫా ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగువుతున్న దృష్ట్యా.. ఐఆర్​ఆర్​ఐలో శిక్షణ పొందిన ప్రతినిధులు... రైతులకు సలహాలు ఇచ్చేందుకు రెండు నెలలపాటు క్షేత్రస్థాయిలోనే గడపనున్నారు. విత్తనాలు చల్లే మల్టీక్రాప్‌ ప్లాంటర్‌ను గ్రామానికి ఒకటి చొప్పున పంపి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు రెడ్డీస్‌ ఫౌండేషన్ ఏరియా మేనేజర్‌ తెలిపారు.

తగ్గుతున్న పెట్టుబడి వ్యయం..: మెట్ట పద్ధతిలో సాగు చేస్తే పెట్టుబడి వ్యయం తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఫలితంగా లాభాలు గడిస్తున్నామని వెల్లడించారు. ఇతరులను కూడా ఈ పద్ధతిలో సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కర్షకులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి..

ఏడేళ్లలో రూ.2.32 లక్షల కోట్లు.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.