నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి శివారులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్య భర్తలిద్దరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో భర్త ఎల్లయ్య మృతి చెందారు. నాంపల్లి మండలం నేమిల్లగూడెంకు చెందిన మేకల ఎల్లయ్య దసరా పండుగకు భార్య రేవతమ్మ, కూతురు అనుషతో కలిసి స్వగ్రామం నేమిల్లగూడెంకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!