ETV Bharat / state

'మా భూమిని మాకు ఇప్పించండి' - నల్గొండ

నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఓ మహిళ కుమార్తెలతో సహా ధర్నాకు దిగింది. ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల నుంచి స్పందన కరవైందని వాపోయారు.

'మా భూమిని మాకు ఇప్పించండి'
author img

By

Published : May 20, 2019, 11:59 PM IST

'మా భూమిని మాకు ఇప్పించండి'

తమకు న్యాయం చేయాలంటూ నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఓ మహిళ కుమార్తెలతో సహా నిరసనకు దిగింది. దివ్యాంగుల కోటాలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మరో వ్యక్తి ఆక్రమించుకున్నారని అధికారుల స్పందించి న్యాయం చేయాలని కోరింది.

నిడమనూరు మండలం ఉట్కూరుకు చెందిన బెజవాడ వెంకటేశ్వరులు, సుశీలకు దివ్యాంగుల కోటాలో 1991లో ప్రభుత్వం వేంపాడు శివారులో ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమిని ఆదే గ్రామానికి చెందిన నారాయణకు కౌలుకు ఇచ్చారు. కొన్నాళ్లు సక్రమంగా కౌలు చెల్లించిన నారాయణ, ఆ తర్వాత భూమిని తన పేరుతో పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్​కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు.

తమ భూమిని ఇప్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్​ను సంప్రదించగా ఎన్నికల విధుల్లో ఉన్నానని... త్వరలోనే విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: 'పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వం'

Intro:tg_nlg_51_20_ boomi kosam_ deeksha_abb_c10
నూతన భూప్రక్షాళన వచ్చిన తర్వాత భూ వివాదాలు మరింత పెరిగాయి దీనికి ఉదాహరణ నిడమనూరు మండల కేంద్రంలోని కార్యాలయం ఎదుట ఓ దివ్యాంగురాలు ఇద్దరు పిల్లలతో సహా తమ భూమి తనకు ఇప్పించాలంటూ దీక్ష చేస్తోంది నిడమనూరు మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన బెజవాడ వెంకటేశ్వర్లు సుశీల ఇద్దరు దివ్యాంగులు వీరికి 1991లో వేంపాడు శివారులో అసైన్మెంట్ కమిటీ తీర్మానం ద్వారా ఐదు ఎకరాల భూమిని వికలాంగుల కోటా కింద మంజూరు చేశారు దివ్యాంగులు కావడంతో వ్యవసాయం చేసుకోలేక కౌలుకిచ్చి తరుణంలో కౌలుకు తీసుకున్న నారాయణ అనే వ్యక్తి ఇ అట్టి భూమిని మన తన పేర పట్టా చేయించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు ఇట్టి విషయాన్ని సదరు తాసిల్దార్ కు విన్నవించగా ఆయన ఎంక్వయిరీ చేసి ఇ భూమి ఎవరితో తేలుస్తామని చెప్పినారు రోజులు గడుస్తున్న పట్టించుకోవడంలేదని ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి సుశీల తాసిల్దార్ కార్యాలయం ముందు దీక్షకు దిగారు భర్త చనిపోవడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు లేక భూమిపై అసలు ఉన్నామని బాధితురాలు ఆమె కూతురు ఇద్దరు వాపోతున్నారు ఎలాగైనా తమ భూమి తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో ఈటీవీ ఆయనను ఫోన్లో సంప్రదించగా ఎన్నికల కౌంటింగ్ డ్యూటీలో ఉన్నానని ఈ రెండు మూడు రోజుల్లో ఎంక్వయిరీ చేయిస్తానని అట్టి భూమి రి అసైన్మెంట్ సక్రమంగా జరిగిందా లేదా అని ఎంక్వయిరీ చేసి ఇ రిపోర్టును ఉన్నతాధికారులకు అందిస్తామని ఆయన చెప్పారు.
బైట్: సుశీల బాధితురాలు.
బైట్: శైలజ బాధితురాలు కూతురు.
బైట్: శివాని బాధితురాలు కూతురు.

Body:వై

Conclusion:క్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.