ETV Bharat / state

రూ.50 వేల అప్పు ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది!

యాభై వేల అప్పు ఇద్దరిని మృత్యు ఒడికి చేర్చింది. అప్పు ఇచ్చిన వ్యక్తిని, తీసుకున్న వ్యక్తిని బలిగొన్న ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇద్దరి ప్రాణాలు తీసిన యాభైవేల అప్పు
author img

By

Published : Nov 18, 2019, 10:39 AM IST

ఇద్దరి ప్రాణాలు తీసిన యాభైవేల అప్పు

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండమల్లెపల్లికి చెందిన నర్రా నారయ్య, యాదగిరికి లక్ష రూపాయలు అప్పు ఇచ్చాడు. యాభై వేలు అప్పు తీర్చగా మిగిలిన డబ్బులు తీర్చడం యాదగిరికి కష్టంగా మారింది. ఈ విషయమై ఈ నెల 13న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నారయ్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్​కు వెళ్తుండగా ఆవరణలో హైబీపీతో కిందపడిపోయాడు.

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16న నారయ్య మృతి చెందాడు. మృతుని బంధువులు నీ అప్పు వల్లే యాదగిరి చనిపోయాడని ఆరోపించగా... యాదగిరి భయంతో పురుగుల మందు తాగాడు. అనంతరం దేవరకొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: తప్పిన గోల్​... పగిలిన లైట్​ పోల్​

Intro:TG_NLG_31_17_2PERSONS_DIED_AV_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365,9666282848

NOTE: సర్, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.Body:
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది.కొండమల్లెపల్లి మండల కేంద్రంలో ఇద్దరి ప్రాణాలు తీసింది 50,000 రూపాయల అప్పు.కొండమల్లెపల్లికి చెందిన నర్ర నారయ్య నుండి యాదగిరి అనే చిరు వ్యాపారి లక్ష రూపాయల అప్పు తీసుకుని యాభై వేలు చెల్లించగా, మరో యాభై వేల రూపాయలు అప్పు చెల్లించాల్సి ఉంది.కాగా ఈనెల 13న ఇద్దరి మధ్య అప్పు గురించి వాగ్వాదం జరిగింది.దీంతో నారయ్య పోలీసులకు పిర్యాదు చేసాడు.యాదగిరి స్టేషన్ కు వెళ్తుండగా స్టేషన్ ఆవరణలో హైబీపీతో కిందపడిపోయాడు.దీంతో చికిత్స నిమిత్తం దేవరకొండకు అక్కడినుండి హైదరాబాదుకు అక్కడినుండి నల్గొండకు తరలించి ఓప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16 రాత్రి మృతి చెందాడు.యాదగిరి చికిత్స పొందుతున్న సమయంలో యాదగిరి బంధువులు నారయ్యను నీ అప్పు వల్లే యాదగిరికి సీరియస్ గా ఉందని ఏమైన అయితే నీదే బాధ్యతని ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వస్తుందని అనడంతో భయపడి మూడు రోజులుగా చింతపల్లి మండలంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.రాత్రి యాదగిరి మృతి చెందగా ఈరోజు ఉదయం నారయ్య ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేశారు.ఈవిషయం చింతపల్లిలో ఉన్న నారయ్యను తెలియడంతో భయంతో ఆందోళనకు గురై పురుగులమందు తాగాడు.పరిస్థితి విషమంగా ఉండడంతో దేవరకొండలో ప్రాథమిక చికిత్స నిర్వహించి హైదరాబాద్ కు తరలిస్తుండగా నారయ్య మార్గమధ్యలో మృతి చెందాడు.నారయ్య బార్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా మరో మృతుడు యాదగిరి మృతదేహాన్ని స్వస్థలం యాదాద్రి జిల్లాకు తీసుకెళ్లారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.