ETV Bharat / state

రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్​ లిస్ట్​లో పెడతాం - collector sridhar

రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని సూచించారు.

రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్​ లిస్ట్​లో పెడతాం
author img

By

Published : May 4, 2019, 1:42 PM IST

రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్​ లిస్ట్​లో పెడతాం

నాగర్​కర్నూల్​ జిల్లా వ్యాప్తంగా రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కలెక్టర్​ శ్రీధర్​ ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, మిల్లర్లలతో కలెక్టర్​ సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, పరదాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్​ తూకాలు, టార్ఫాలిన్​లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించిన వెంటనే రసీదులు తీసుకోవాలన్నారు. రైతులకు 48 గంటల్లోనే నగదు అందించాలని సూచించారు.

అచ్చంపేటలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, రైతులను అవస్థలకు గురిచేస్తే ఆయా సంస్థలను బ్లాక్​ లిస్ట్​లో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, జిల్లా రైస్​ మిల్లర్ల అసోసియేషన్​ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పంటల బీమా గడువు ఖరారు చేసిన వ్యవసాయశాఖ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.