నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సబ్ జైలు వద్ద ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పుంపును జైళ్ల శాఖ ఐజీ సైదయ్య, డీఐజీ భాస్కర్, ఎల్వోసీ ఆఫీసర్ ఆర్ఎస్ఎస్ రావు ప్రారంభించారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 24 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని ఐజీ సైదయ్య తెలిపారు.
అదే మా బాధ్యత..
కారాగారంలోని ఖైదీలు కేవలం శిక్ష అనుభవించడం కోసం మాత్రమే కాదని.. వారికి సంస్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యావజ్జీవ శిక్ష, 5 ఏళ్లకు పైగా శిక్ష పడ్డ ఖైదీలకు.. వారు విడుదలయ్యాక సమాజంలో ఎలా బతకాలి అనే సమస్య ఉత్పన్నమవుతుందని అన్నారు. అలాంటి వారిని సమాజంలో గౌరవంగా జీవించే పరిస్థితిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా.. ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఖైదీగా ఉన్నప్పుడు నెలకు రూ. 5 వేల జీతం, విడుదలైన తర్వాత రూ. 12,000 జీతం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీస్ ఠాణాలకు కరెంట్ కట్ చేసిన తండ్రి అరెస్ట్