నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగులో పబ్బతి ఆంజనేయ స్వామి ఉత్సవాలను ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఆలయ అర్చకులు గువ్వల దంపతులిద్దరికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
గువ్వల దంపతులు హనుమద్గాయత్రి యజ్ఞోత్సవంలో పాల్గొన్నారు. నల్లమలలో వెలిసిన పబ్బతి మద్దిమడుగు హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని బాలరాజు తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృష్ణానదీ తీరాన పెద్ద వంతెన వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో హిజ్రాల హల్‌చల్.. 10మంది అరెస్ట్