పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూ నిర్వాసితులు బిజినేపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులు గత కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ.. ఆందోళనలు చేస్తున్నారు. నిన్న ప్రగతిభవన్ ముట్టడికి పాదయాత్రగా బయల్దేరిన ఆందోళనకారులను జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుకు నిరసనగా... ఈరోజు బిజినేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల పోలీసులు నిర్వాసితులతో చర్చించి ధర్నాను విరమింపజేశారు.
ఇవీ చూడండి: నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...!