నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం, నార్లాపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పెంట్లవెళ్లి మండలంలో 2, పెద్దకొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 6 ఇళ్లు కూలినట్లు తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తులు వచ్చాయి.
చిన్నంబావి మండలంలోని బెక్కం గ్రామంలో ఓ ఇళ్లు కూలింది. పాన్ గల్ మండలంలోని గోప్లపూర్ గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి వేరుశనగ పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్ లో చుక్కాయిపల్లి చెరువు నిండి అలుగుపారుతోంది.