ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పశువుల కాపరులు మృతి

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పశువుల కాపరులు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వారి మృతికి కారణం పోస్టుమార్టం రిపోర్టు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పశువుల కాపరులు మృతి
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు పశువుల కాపరులు మృతి
author img

By

Published : Jul 7, 2020, 6:12 AM IST

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మున్నూరు వెంకటయ్య(45), ఎరుకలి చెన్నయ్య(45) అనే ఇద్దరు పశువుల కాపరులు రోజులాగే చెందాయి పల్లి గ్రామ శివారులో పశువులు కాయడానికి వెళ్లారు. వీరిద్దరూ సాయంత్రం పశువులను కాస్తూ అక్కడే ఇద్దరూ వేరు వేరు చోట్ల కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారిద్దరు కలుషిత ఆహారం వల్ల చనిపోయారా లేదా ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గాంధీ తెలిపారు.

అయితే వారి మృతికి కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తేలుతాయని... ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.