ETV Bharat / state

ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు - tsrtc strike news today

ఆర్టీసీ కార్మిక సంఘం సమ్మెలో భాగంగా కల్వకుర్తి డిపోలోని కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
author img

By

Published : Oct 5, 2019, 11:09 AM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఆర్టీసీ డిపోలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే 102 బస్సులు నిలిచిపోయాయి. 446 మంది కార్మికులు సమ్మె బాట పట్టడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి 10-20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు.

ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు

ఇవీ చూడండి: సమ్మె ఎఫెక్ట్​: సాయంత్రం 6 వరకే కార్మికులకు డెడ్​లైన్​

Tg_mbnr_04_05_rtc_samme_update_avb_3068847 రిపోర్టర్ స్వామి కిరణ్ కెమెరామెన్ శ్రీనివాస్ విజువల్స్ ద్వారా వచ్చాయి గమనించగలరు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 9 లోని డిపోల లోని 880 బస్సులు దాదాపుగా డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె నేపథ్యంలో 9 డిపోల పరిధిలో 3900 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ కారణంగా బస్సులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆర్టీసి అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రద్దీ అధికంగా ఉండే రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 230 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వాటిని యథాతథంగా నడపనున్నారు . వీటితోపాటు పాఠశాల బస్సులను దగ్గర ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను దూరప్రాంతాలకు పంపనున్నారు. వీటిని నడపడానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టిఏ కార్యాలయాల్లో తాత్కాలిక డ్రైవర్ కండక్టర్ ల నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ధ్రువీకరించిన కండక్టర్లు డ్రైవర్లు డిపో లకు చేరుకొని ఒక్కో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి డిపో పరిధిలో నాలుగైదు బస్సులు బయటికి వెళ్ళాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బస్సులు యధాతధంగా నడుస్తున్నాయి. నామమాత్రపు రుసుములతో ప్రైవేటు వాహనాలను కూడా నడిపేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. మరోవైపు డిపోల నుంచి బయటకు వెళ్లే బస్సులు ఎలాంటి ఆటంకాలు లేకుండా గమ్యస్థానాలకు చేరుకునేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా లో బస్సులు బయటకు వెళ్తున్నా యి. సమ్మె సమాచారం లేని ప్రయాణికులు ప్రయాణ ప్రాంగణం బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.