నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. గత 55 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు.. ముఖ్యమంత్రి ఆదేశాలతో విధుల్లోకి హాజరయ్యారు.
సమ్మె కాలంలో ప్రాణాలు వదిలిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి కార్మికులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులకు కొబ్బరికాయలు కొట్టి ప్రయాణాలను ప్రారంభించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు