ETV Bharat / state

లైవ్ వీడియో: పెద్దవాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగును దాటేందుకు రైతులు ట్రాక్టర్​పై బయలుదేరారు. సగం దూరం వచ్చాక.. వారి ట్రాక్టర్​ నీటిలో కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు రైతులను కాపాడారు. ఈ ఘటన కొల్లాపూర్​ మండలంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Oct 11, 2020, 2:52 PM IST

tractor flushed away in peddavagu floods in kollapur mandal nagarkurnool district
ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్... తప్పిన ప్రాణాపాయం

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ముక్కిడిగుండం, గేమ్యనాయక్​ తండా, మొలచింతలపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ముక్కిడిగుండం నుంచి ట్రాక్టర్​పై వస్తున్న రైతులతో ఉన్న ట్రాక్టర్ వాగులో కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు రైతులను కాపాడారు.

జేసీబీతో ట్రాక్టర్​ను లాగుతున్న క్రమంలో ట్రాక్టర్ నీటిలో పడిపోయింది. ప్రతి ఏటా వర్షకాలం వస్తే వాగు దాటడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. వాగులపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలకు అంతరాయం లేకుండా... ప్రమాదాల బారిన పడకుండా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: వాయుగుండంగా అల్పపీడనం.. మరో మూడురోజుల పాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.