ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో త్వరలోనే జాతీయస్థాయి వేరుశనగ విత్తన పరిశోధన సంస్థను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లాలో 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సబ్సిడీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ముందుగానే టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, ఎంపీ రాములు, స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పాక్ దుశ్చర్యకు 16 మూగజీవులు బలి