నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో రెండు మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తాడూరు, తెల్కపల్లి, కల్వకుర్తి మండలాల్లోని రఘుపతి పేట, రామగిరి మధ్యలో ఉన్న దుందుభి నది వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కురిసిన భారీ వర్షానికి చిన్న చిన్న కుంటలు నిండుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ పొలం బాట పట్టారు.
ఇవీ చూడండి : బ్యాన్ కాదు వినియోగించుకోవటం తెలుసుకోవాలి...!