నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వట్టెం గ్రామ వెంకటేశ్వర దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగల కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆలయ పర్యవేక్షకులు తెలిపారు. నలుగురు వ్యక్తులు ముఖానికి ముసుగు కప్పుకుని చెడ్డీల మీద వచ్చినట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవమూర్తుల కల్యాణానికి సంబంధించిన నాలుగు తులాల బంగారు పుస్తెలు, రెండు శఠగోపాలు, సుమారు కిలో వెండిని ఎత్తుకెళ్లారు. 2 హుండీలను పగలగొట్టి అందులోని నగదును దొచికెళ్లినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, పోలీసు జాగిలాలతో విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: దేవరకద్రలో భక్తిశ్రద్ధలతో వీర నాగమ్మ ఉత్సవాలు