రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో... జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయురాలు సత్తాచాటారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఆర్టీఎస్ ఐదో వార్షికోత్సవ కవి సమ్మేళనంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలు సాయి జ్యోతి ప్రతిభ చాటారు.
ప్రజలు కరోనా బారిన పడకుండా జాగృతం చేసేందుకు కవి సమ్మేళనం నిర్వహించారు. కరోనా రక్కసి అనే అంశంతో పాటు... కరోనా సమయంలో మహిళ పాత్ర... ఓ మహిళ నీకు జోహార్లు అనే అంశంపై కవితా గానం చేసిన ఉపాధ్యాయురాలు సాయి జ్యోతిని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో బ్రెజిల్, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలకు చెందిన వారితో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 350 మంది తెలుగు కవులు పాల్గొని కవితా గానం చేశారు.