ETV Bharat / state

Teacher Breaches Biometric Attendance : 'మా సారు బడికి రారు.. కానీ రోజూ హాజరు మాత్రం ఉంటుంది.. ఎలాగో తెలుసా..?' - బయోమెట్రిక్‌ మాయాజాలంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం

Teacher Breaches Biometric Attendance Nagarkurnool : ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడూ సక్రమంగా బడికి రారు. కానీ బయోమెట్రిక్‌ యంత్రంలో మాత్రం పాఠశాలకు హాజరైనట్లు నమోదవుతుంది. తరగతి గదిలో పాఠాలు చెప్పకున్నా నెల నెలా పూర్తి వేతనం అందుకుంటాడు. అనుమానం వచ్చిన కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీ పెట్టుకోవటంతో సదరు ఉపాధ్యాయుని లీలలు వెలుగులోకి వచ్చాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితిని అద్దం పట్టేలా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ టీచరు సాగించిన బయోమెట్రిక్‌ మాయాజాలంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Teacher Breaches Biometric Attendance Nagarkurnool
Teacher Breaches Biometric Attendance
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 9:13 AM IST

Teacher Breaches Biometric Attendance మా సారు బడికి రారు.. కానీ రోజూ హాజరు మాత్రం ఉంటుంది

Teacher Breaches Biometric Attendance Nagarkurnool : నాగర్​కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం 'లొట్లోనితండా' ప్రాథమిక పాఠశాల అది. 2022-23 విద్యా సంవత్సరంలో అక్కడ 18 మంది విద్యార్థులు చదివేవాళ్లు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అక్కడ ఒకే ఉపాధ్యాయుడు సాయిరెడ్డి ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు కూడా ఆయనే. అయితే ఆయన ఎప్పుడు బడికి సక్రమంగా వచ్చేవారు కాదని ఫిర్యాదులున్నాయి. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్(Telangana Graduates Association) సభ్యులు ఆరా తీశారు.

Biometric Attendance System Fraud Nagarkurnool : బయోమెట్రిక్ హాజరు చూస్తే అతను బడికి వస్తున్నట్లుగా హాజరు నమోదవుతుంది. కానీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే అతను ఎప్పుడు బడికి సక్రమంగా వచ్చింది లేదు. దీంతో అనుమానం వచ్చిన గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా అతని బయోమెట్రిక్ హాజరు వివరాలను కోరింది. ఆ దస్త్రాలను పరిశీలిస్తే, సమయానికి బయోమెట్రిక్ యంత్రం(Biometric Machine) ద్వారా హాజరు నమోదు చేస్తున్నాడు.. కానీ 75 శాతానికి పైగా ఆయన పాఠశాలలో కాకుండా బయటి ప్రాంతాల నుంచి హాజరు నమోదు చేసుకున్నట్లుగా తేలింది. బయోమెట్రిక్ హాజరు యంత్రాన్ని వెంటబెట్టుకొని వెళ్లి ఆ సమయానికి ఎక్కడుంటే అక్కడ వేలిముద్రతో హాజరు నమోదు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాగర్​కర్నూల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఆయనను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.

Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు

Cheat Biometric Attendance System : ఉపాధ్యాయుడు సక్రమంగా బడికి రాకపోవడంతో 'లొట్లోనితండా' ప్రాథమిక పాఠశాలలో 18గా ఉన్న విద్యార్థుల సంఖ్య.. గతేడాది 9మందికి చేరింది. ఈ విద్యార్థులు కూడా వెళ్లిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సాయిరెడ్డిని ప్రస్తుతం మరోచోటకు మార్చారు. దీంతో పాఠశాలను మూసేశారు. ఏకోపాధ్యాయుని బయోమెట్రిక్ లీలలు బయటపడుతుండడంతో అతనినీ కాపాడేందుకు అధికారులు ఆ బడిని మూసేసి.. మరోచోట డిప్యూటేషన్​పై విధులు కేటాయించారాని పలువురు ఆరోపిస్తున్నారు.

Gongadi Wool Shoes : 'గొంగడి'తో షూస్.. ఐడియా అదిరింది బాస్

Biometric Attendance System Cheating : ఇది కాకుండా గతేడాది బడి నడిచినట్లు, పరీక్షలు నిర్వహించినట్టు, పేరెంట్స్ కమిటీ సమావేశాలు జరిపినట్లుగా తప్పుడు సమాచారం నమోదు చేశారని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ ఆరోపిస్తున్నారు. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఇన్విజిలేటర్​గా పని చేయకపోయినా పని చేసినట్లుగా రాయించుకుని 14 రోజుల ఎర్నింగ్ లీవ్స్ పొందారని.. చివరకు అసలు విషయం బయటపడటంతో ఇచ్చిన 14 సెలవులను రద్దు చేశారని భరత్(Telangana Graduates Association President Bharat) తెలిపారు.

ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు బయోమెట్రిక్ హాజరు అమలు తీరును విద్యాశాఖ పరిశీలించి మార్పులు చేయాలని భరత్ కోరుతున్నారు. ఏడాది పాటు ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకపోయినా హాజరు నమోదు చేయటంపై కనీస సమాచారం లేకపోవటం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

Nainika Thanaya You Tube Channel : అదిరిపోయే స్టెప్పులతో ఫిదా చేస్తున్న అమెరికాలో ఉంటున్న ఓరుగల్లు అక్కాచెల్లెళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.