కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థల బంద్ ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పీజీ సెంటర్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఆందోళనలో రద్దు చేసిన పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని కోరారు. ఆ ప్రాంతంలో ఆన్ లైన్ క్లాస్‌లకు తరచూ సిగ్నల్ సమస్య ఉంటుందని.. ప్రత్యక్ష తరగతుల బోధనకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి