నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్ కాటేదాన్‌లో ఉండేవాడు. లాక్డౌన్ వల్ల సొంత గ్రామానికి వచ్చిన అతనికి డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల చికిత్స నిమిత్తం మళ్లీ భాగ్యనగరానికి వెళ్లాడు.
అక్కడ కరోనా బారిన పడిన ఆ వృద్ధుణ్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అతనికి సంబంధించి ఏడుగురు ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి వారిని క్వారంటైన్లో ఉంచామని వెల్లడించారు.
- ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన