నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరిసనగండ్ల శ్రీ సీతారాముల దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని అర్చకులు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా సిరసనగండ్ల గ్రామ పెద్దలు వరుడు రామచంద్ర స్వామి, వధువు సీతమ్మ తరుఫున పెళ్లి పెద్దలుగా ఉండి కల్యాణం జరిపారు.
ఈ మహోత్సవంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వర్షాన్ని లెక్కచేయకుండా యాదాద్రికి పోటెత్తిన భక్తులు