నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేతర బండతండ సమీపంలో మార్కండేయ రిజర్వాయర్ సర్వే పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. సాయినీపల్లి నుంచి పాదయాత్రగా బయలుదేరి తండా సమీపంలో సర్వే పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు పది కిలోమీటర్లు అనుచరులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కేఎల్ఐ కాలువ గుండా పాదయాత్ర నిర్వహించారు.
10 వేల ఎకరాలకు సాగునీరు
మార్కండేయ రిజర్వాయర్ కట్టబోయే ప్రాంతాన్ని సందర్శించి రైతుల అభిప్రాయాలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తెలుసుకున్నారు. రెండు నెలల్లో రిజర్వాయర్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి అయితే 10 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. తండా సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు పలు సూచనలు చేశారు. రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి కొనుగోలు చేసి ఇస్తామని.. ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న