ETV Bharat / state

మీరిచ్చే టీ, బిస్కెట్ల కోసం వచ్చామా..? - నాగర్​కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

నాగర్​కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికారులు కాకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై ఎవరిని అడగాలని ప్రశ్నించారు. మీరు ఇచ్చే టీ, బిస్కెట్ల కోసం వచ్చామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

public representatives fire on district officers in nagar karnool zp general body meeting
నాగర్​కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Sep 13, 2020, 3:52 PM IST

నాగర్​కర్నూలులో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం... జడ్పీ ఛైర్మన్ పెద్దపల్లి పద్మావతి అధ్యక్షతన జరిగింది. జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ, ఆర్​అండ్​బీ, పంచాయతీ రాజ్, అటవీ, విద్యాశాఖ, ఎన్​ఆర్​ఈజీఎస్​, మైనింగ్ శాఖలపై చర్చించారు. జిల్లాలోని పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు పలువురు జిల్లా స్థాయి అధికారులు, ప్రభుత్వ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

public representatives fire on district officers in nagar karnool zp general body meeting
సమావేశంలో ఎంపీ పోతుగంటి రాములు

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. కొవిడ్​కు జిల్లావ్యాప్తంగా ఎంత ఖర్చు చేశారో నివేదికలు సమర్పించాలని కోరారు. మైనింగ్ శాఖ ద్వారా వచ్చిన రూ.60 కోట్లతో జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో నెట్​వర్క్​ సమస్యల వల్ల ఆన్​లైన్​ క్లాసులు విద్యార్థులు వినలేక పోతున్నారని... ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు తెలిపారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరారు.

సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై సమాచారం కోసం ప్రజాప్రతినిధులు ఎవరిని అడగాలి... జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎందుకు వచ్చారు? మీరిచ్చే టీ, బిస్కెట్ల కోసం వచ్చారా? అని ప్రశ్నించారు. వెంటనే అధికారులు హుటాహుటిన సమావేశానికి వచ్చారు. కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, సంయుక్త కలెక్టర్, జడ్పీ సీఈవో మనూ చౌదరి హాజరయ్యారు.

ఇదీ చూడండి: వేగంగా సాగుతున్న రైతువేదిక నిర్మాణ పనులు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.