నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం కోసం వెళ్లిన 40 మంది గర్భిణులు ఉదయం 9 గంటల నుంచి వైద్యుని కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కూడా సదుపాయం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు కరోనా.. మరోవైపు ప్రసవవేదనతో భయాందోళనకు గురవుతున్నారు.
కరోనా సాకుతో ఆస్పత్రి సిబ్బంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. మధ్యాహ్న సమయంలో వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని ఆరోపించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : మొండిగా ఉంటేనే.. మహమ్మారిని ఎదుర్కోగలం : కేసీఆర్