ETV Bharat / state

'రీడిజైన్​ల పేరుతో డబ్బులను దండుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నం'

కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలను కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు నేతృత్వంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై అడ్డగించారు.

'రీడిజైన్​ల పేరుతో డబ్బులను దండుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నం'
'రీడిజైన్​ల పేరుతో డబ్బులను దండుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నం'
author img

By

Published : Oct 19, 2020, 12:53 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డగించి పోలీస్ స్టేషన్​కు తరలించారు. వెల్దండ మండల కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలను కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు నేతృత్వంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై అడ్డగించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను, నేతలను ప్రజా సమస్యలపై స్పందించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నవారిని పోలీసులతో అడ్డగించటం తగదన్నారు. ప్రాజెక్టులు, ఇతర భవనాలను రీడిజైన్​ల పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీటిని అందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇదీ చూడండి: కొరియర్​ బాయ్​ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.