నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ లైలి ఆయుష్మాన్ ఫామిలీ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాచారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సాయిబాబాకు జ్వరం రావడం వల్ల దసరా రోజును ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు హై డోస్ మెడిసిన్స్, ఇంజక్షన్లు ఇవ్వడం సాయిబాబా పరిస్థితి విషమించింది. విషయం అర్థమైన వైద్యుడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు పంపించాడు. కిడ్నీపై తీవ్రమైన ప్రభావం పడి సాయిబాబా అక్కడే మృతి చెందాడు. మృతిదేహాన్ని ఆస్పత్రి ఎదుటే ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొంత సేపు అక్కడ ఉద్రికత పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిని సీజ్ చేసి... వైద్యుడు విష్ణు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని బందువులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని ఆస్పత్రిని సీజే చేసి, సాయిబాబా మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్!