నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని అక్షర వనాన్ని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు సందర్శించారు. విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగానే విద్యాబోధన జరగాలని, శాస్త్రీయ పద్ధతులు, సామర్థ్యాలతో నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. అక్షరవనంలో సులభతర పద్ధతిలో గణితం బోధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వచ్చే నూతన విద్యా విధానం ద్వారా తరగతి గదిలో విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారనే అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులను వారికి బోధిస్తున్న ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్, అక్షరవనం సభ్యులు శ్రీపతి రెడ్డి, మాధవరెడ్డి, ప్రిన్సిపల్ ఎల్లయ్య ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు