కొవిడ్-19 నియంత్రణకు దాతలు అందజేసే విరాళాల చెక్కులను కొందరు తన ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి కష్ట కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండకుండా తమ స్వలాభం చూసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు. సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇందుకు సహకరించిన అధికారులపై కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆధారాలతో సహా ప్రజల ముందు బయటపెడతామని హెచ్చరించారు.
జిల్లా ప్రజలు ఎవరైనా విరాళాలు అందించాలంటే నేరుగా ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయనిధికి నేరుగా అందించవచ్చని సూచించారు.