ETV Bharat / state

పెంట్లవెల్లి మండలంలో జిల్లా పాలనాధికారి ఆకస్మిక పర్యటన - raithu vedhika

ఉదయం నడకలో భాగంగా జిల్లా పాలనాధికారి శర్మన్​ పెంట్లవెల్లి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

nagarkurnool ditrict collector visited pentlavelli mandal
పెంట్లవెల్లి మండలంలో జిల్లా పాలనాధికారి ఆకస్మిక పర్యటన
author img

By

Published : Sep 4, 2020, 12:18 PM IST

ఉదయం నడకలో భాగంగా నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ శర్మన్​ పెంట్లవెల్లి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. పెంట్లవెల్లి, జటప్రోలు, కొండూర్, మంచాలకట్ట గ్రామాల్లో జరుగుతున్న డంపింగ్ యార్డులు, రైతు వేదిక భవనాలు, స్మశానవాటికలు, ప్రభుత్వ పనులను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీడీవోకు సూచించారు. అదేవిధంగా పెంట్లవెల్లిలో రైతు వేదిక భవనం పనులు ఎందుకు ప్రారంభం కాలేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు కచ్చితంగా చేయాలని.. అలా చేయని యెడల అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని గ్రామ సర్పంచ్​లకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఆస్కారం ఉంటుందన్నారు.

ఇవీ చూడండి: ‘దినార్‌’ వేటలో దీనగాథలు.. ఉపాధి కోసం వెళ్తే కాటేసిన కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.