విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు మొగ్గు చూపాలంటే ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ అన్నారు. నల్లమల బయో సైన్స్ ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించిన పాలపిట్ట పత్రికను జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి రేకెత్తించేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుందని కలెక్టర్ అన్నారు.
![nagarkurnool district collector sharman chauhan launched palapitta book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8552031_1063_8552031_1598354577602.png)
ప్రతి విద్యార్థి జీవవైవిధ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.
![nagarkurnool district collector sharman chauhan launched palapitta book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-8-25-collector-samiksha-avb-ts10050_25082020161810_2508f_1598352490_560.jpg)
- ఇదీ చదవండి: యాక్టివ్ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు