అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని నాగర్‌కర్నూల్ కలెక్టర్ శర్మన్ స్పష్టం చేశారు. రైతువేదిక నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలేరు సర్పంచ్, ఉపసర్పంచ్‌లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని చిన్న కొత్తపల్లి, సాతాపూర్, ఆలేరు గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదికలను కలెక్టర్.. బుధవారం పరిశీలించారు. ఆయా గ్రామాల అధికారులు, సర్పంచ్‌లతో.. ఇంకుడు గుంతలు, పల్లె ప్రకృతి వనాలు, రైతుల వేదికలు, వైకుంఠ ధామాలు, ఎరువుల షెడ్లు, ఆన్‌లైన్ తరగతులపై పర్యవేక్షణ అంశాలపై చర్చించారు. పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తిచేయాలని ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను పరిశీలించారు. పనులు నత్తనడక సాగుతున్నాయని.. ఈనెల 30 లోపు ఎలా పూర్తి చేస్తారని అధికారులు, సర్పంచులపై పాలనాధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆశించిన స్థాయిలో లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలేరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేయాలని డీపీఓ సురేశ్ మోహన్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు.
ఇవీచూడండి: వచ్చే నెల 3 నుంచి అందుబాటులోకి ధరణి సేవలు