అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా కరోనా టీకా వేయించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి దశ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడం కోసం తాను వ్యాక్సిన్ తీసుకున్నానన్నారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కలెక్టర్ కోరారు.
ఫిబ్రవరి 13న ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా... రెవెన్యూ, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు వ్యాక్సిన్ తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. మొదటిదశలో భాగంగా 9,297 మందికి గాను ఇప్పటి వరకు 4,200 మంది మాత్రమే వ్యాక్సినేషన్ వేయించుకున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఇదీ చదవండి: అక్కడ కరోనా కేసుల పెరుగుదల.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం