నాగర్ కర్నూలు లోక్ సభ స్థానాన్ని స్థానికులకే కేటాయించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియానుకలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్ను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లగా స్థానికులకు అన్యాయం జరుగుతోందని.. ఈ సారైనా స్థానికులకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. నాగర్ కర్నూలు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నంది ఎల్లయ్య ఉన్నారు.
ఇవీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించిన కాంగ్రెస్