ETV Bharat / state

సర్కారు బడిలో ఎంపీడీఓ కూతురు - daughter shruthi

ప్రైవేటు వద్దు- ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని అనుకున్నాడు ఓ మండల స్థాయి ప్రభుత్వ అధికారి. తన కూతురును నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రైవేటు కన్నా సర్కారు బడులే మిన్న అని చాటాడు ఎంపీడీఓ రామ్మోహన్ రావు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని : ఎంపీడీవో కూతురు
author img

By

Published : Jun 15, 2019, 6:12 AM IST

ప్రైవేటు వద్దు- ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని తలిచాడో ఎంపీడీఓ

పదో తరగతి చదువుతున్న తన కూతురు శ్రుతిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సర్కారు బడులపై ప్రజలకు భరోసా కల్పించాడు నాగర్​కర్నూల్ ఎంపీడీఓ రామ్మోహన్ రావు. ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ.. తమ పిల్లల్ని అప్పులు చేసి మరీ ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారన్నారు.

ప్రభుత్వ టీచర్లు అన్ని విభాగాల్లో శిక్షణ పొంది, సంపూర్ణ విద్యావంతులు కాబట్టే.. తన కూతురు శ్రుతిని చేర్పించామని ఎంపీడీఓ తెలిపారు. నాగర్​కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు స్వయంగా వచ్చి అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా తరగతి గదిలో కూతురిని కూర్చోబెట్టి ఆదర్శంగా నిలిచారు.

'ప్రభుత్వ పాఠశాలల్లోనే నిపుణులైన ఉపాధ్యాయులు'

ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారని.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన అధ్యాపకులు లత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు ఇతరులు కూడా వారి పిల్లల్ని కూడా సర్కారు పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని విజ్ఞప్తి చేశారు.

ప్రైవేటు పాఠశాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని ఎంపీడీవో కూతురు శ్రుతి ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల వాతావరణం బాగా నచ్చిందని ఆమె తెలిపింది.

ఇవీ చూడండి : 'కేసీఆర్​ తెలివైన అవినీతి పరుడు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.