నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని పలు వార్డుల్లో సీసీ రహదారులు, నూతన మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపన చేశారు. పురపాలక పరిధిలోని రూ. రెండు కోట్ల 30 లక్షల పనులను ఆయన ప్రారంభించారు. కల్వకుర్తి పురపాలికగా మారిన వెంటనే పట్టణానికి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరగటం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారన్నారు.
ఇదీ చదవండిః ఛోక్సీని భారత్‌కు అప్పగించనున్న ఆంటిగ్వా!