ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించండి' - Nagarkurnool district news

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్జీఓస్ కాలనీలో మిషన్ భగీరథ పైప్​లైన్​కు భూమి పూజ చేశారు.

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించండి'

author img

By

Published : Oct 5, 2020, 10:11 PM IST

తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గతంలో సాధ్యం కాని తీరులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... గ్రామ పంచాయతీలను, పురపాలికలను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో మిషన్ భగీరథ పైప్​లైన్​కు భూమి పూజ, పురపాలక సంఘానికి సంబంధించిన మూడు కొత్త ట్రాక్టర్లను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ పోతుగంటి రాములు ఓటును నమోదు చేసుకునేందుకు ఆర్డీఓ రాజేశ్ కుమార్, తహసీల్దార్ రాంరెడ్డికి దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షుడు సత్యం రెడ్డి, జడ్పీటీసీలు భరత్ ప్రసాద్, విజితారెడ్డి, ఎంపీపీ సునీత, ఏఎంసీ ఛైర్మన్ బాలయ్య, తెరాస నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.