నాగర్‌కర్నూల్ పట్టణంలోని మటన్ మార్కెట్, కిరాణా సముదాయాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా పర్యవేక్షించారు. కిరాణ షాపు యజమానులు నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు చేపడతామని యజమానులను హెచ్చరించారు.
అనంతరం స్థానిక మటన్ మార్కెట్లో భౌతిక దూరాన్ని పాటించి మాంసాన్ని కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. విధిగా అందరూ మాస్కులు ధరించాలని కోరారు. మటన్ షాప్‌లను అపరిశుభ్రంగా ఉంచుకున్న వారిపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.