జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ప్రారంభించడం వల్ల అత్యవసర పరిస్థితిలో రోగులను వేరే ఆస్పత్రికి పంపించాల్సిన బాధలు తప్పుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
జిల్లాకు మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి మంజూరు అయిందని త్వరలోనే 8 కోట్ల వ్యయంతో 50 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తామన్నారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంథ్ సౌజన్యంతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పులిహోర, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం భారీ యంత్రాలు