నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిజినపల్లి మండలం లట్టుపల్లికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు భార్య , పిల్లలతో కలిసి బిజినేపల్లి నుంచి లట్టుపల్లికి బైక్‌పై వెళ్తుండగా మంగనూర్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య, పిల్లల్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే గాయపడ్డ వారిని పరామర్శించేందుకు జిల్లా ఆస్పత్రికి వచ్చారు. క్షతగాత్రుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలై 2 గంటలు అయినా వారికి ఎలాంటి చికిత్స చేయకపోవడంపై కోపగించారు.
భర్త చనిపోయి, తీవ్ర గాయాలై తీవ్ర మనోవేదనలో ఉన్న భార్యకు ఎక్స్ రే కూడా తీయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆర్థోపెడిక్ డాక్టర్, ఎక్స్‌రే టెక్నీషియన్ సరైన సమయంలో స్పందించక పోతే ఎలా అన్నారు. భోజన విరామం నుంచి వచ్చిన సూపరింటెండెంట్‌ను ఈ ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
ఇవీ చూడండి:మంత్రి గారి చేతి కడియం కొట్టేశారు!