కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఐసోలేషన్ కేంద్రం కోసం మైనార్టీ గురుకుల పాఠశాలను డీఎంహెచ్వో సుధాకర్ లాల్తో కలిసి పరిశీలించారు. బాధితులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోజూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని అన్నారు. సొంత ఖర్చులతో స్థానికంగా చికిత్స పొందే బాధితులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలన్నారు. బాధితుల్లో ధైర్యాన్ని నింపి... ఆరోగ్యంగా ఇంటికి పంపాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఛైర్మన్ రఘు ప్రోలు విజయలక్ష్మి, కమిషనర్ విక్రమ్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రభుత్య ఆస్పత్రి ఇంఛార్జి డాక్టర్ భరత్, వైద్యులు యశ్వంతరాని, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు.. ఏ రాష్ట్రాల్లో ఎలా?