ETV Bharat / state

'చివరి ఆయకట్టు వరకు నీరివ్వటమే లక్ష్యం'

author img

By

Published : Jul 29, 2020, 11:05 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో కేఎల్​ఐ సాధన సమితి సభ్యులతో ఎంపీ పోతుగంతి రాములు, ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్​ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

mla and mp participated in meeting in kalvakurthi

చివరి ఆయకట్టు వరకు నీరివ్వటమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ అతిథి గృహంలో కేఎల్ఐ సాధన సమితి సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్వపు మహబూబ్​నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన కాలువలు, ప్రాజెక్టు నిర్మాణాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు.

ఈ ప్రాంత రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలన్న నిర్ణయంతో విడతల వారిగా... 29- ప్యాకేజీ, డీ-82 కాల్వల కోసం రూ. 150 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, జలసాధన సమితి సభ్యులు లక్ష్మణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.