వలస కూలీల గోస.. చెట్లకిందే బస.. - Lockdown problems: Southend 'overwhelmed' by daytrippers
ఇతర రాష్ట్రాల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిన వలస కూలీల కుటుంబాలకు స్వగ్రామాల్లోను తిప్పలు తప్పటం లేదు. ముంబయి నుంచి వచ్చిన 69 మందిని.. తండాల్లోకి అనుమతించకపోవడం వల్ల పొలాల్లో చెట్ల కిందనే నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని పరామర్శించి, నిత్యావసరాలు అందించారు.
వలస కూలీల కుటుంబాలకు స్వగ్రామాలకు వచ్చినా తిప్పలు తప్పటం లేదు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి పొట్టకూటి కోసం ముంబయి వెళ్లిన గుండేనాయక్‌తండా, రేకులపల్లితండాకు చెందిన 69 మంది తిరిగి వచ్చారు. వారిని తండాల్లోకి అనుమతించకపోవటం వల్ల పొలాల్లో చెట్ల కిందనే నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీరాములు, సీఐ వెంకట్‌రెడ్డి, తహశీల్దార్ శేషగిరిరావులు ముంబయి నుంచి వచ్చిన వారిని పరామర్శించారు.
వలస కూలీల వివరాలు, సమస్యలను అధికారులు తెలుసుకున్నారు. సర్పంచుల ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించారు. చెట్ల కింద ఉండేందుకు బోరుబావుల నుంచి కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలని సర్పంచులు పద్మ, లాల్‌సింగ్‌కు సూచించారు. అక్కడ టెంట్లు ఏర్పాటు చేయించారు. 14 రోజుల పాటు ఇలాగే ఉండాలని అధికారులు పేర్కొన్నారు.