ETV Bharat / state

నాగర్​కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల వద్ద రద్దీ - నాగర్​కర్నూల్ జిల్లా

లాక్​డౌన్​ అమలుతో సుమారు నెలన్నర రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. నాగర్​కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, బిజినేపల్లి తదితర ప్రాంతాల్లో మద్యం ప్రియులు ఆయా దుకాణాల ఎదుట బారులు తీరారు.

నాగర్​కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల వద్ద రద్దీ

author img

By

Published : May 6, 2020, 6:52 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలో మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మద్యం దుకాణాలను తెరిచేలా చర్యలు తీసుకోవడం వల్ల దుకాణాల వద్ద మద్యం బాబులు బారులు తీరారు. మద్యం అమ్మేవారు దుకాణాల ముందు భౌతిక దూరం పాటించే విధంగా వృత్తాలను గీసి వరుస క్రమాన్ని ఏర్పాటు చేశారు. మద్యం ప్రియులు ఉదయం నుంచే వరుసలో నిలబడి మద్యం కొనుగోలు చేశారు. మద్యం కొనేవారు చేతులకు బ్లౌజులు, మాస్కులు వేసుకోవాలని కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ సైదులు, ఎస్సై మహేందర్ దుకాణదారులకు, ప్రజలకు సూచించారు. మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

ఉదయం నుంచే క్యూలో...

దుకాణాల వద్ద మద్యం ప్రియులు ఉదయం నుంచే బారులు తీరారు. జిల్లా కేంద్రంతో పాటు బిజినేపల్లి, తాడూరు, తెల్కపల్లి, తిమ్మాజీపేట మండల కేంద్రాల్లో వైన్ షాపుల ముందు ఉదయం నుంచే క్యూలో నిలబడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ, దూరంగా నిలబడుతున్నారు. షాప్​లు తియడానికి ఒక గంట ముందే క్యూలో నిల్చుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు వైన్ షాపుల ముందు బందోబస్తు నిర్వహించారు. వైన్ షాపుల ముందు క్యూ పాటించేందుకు కోసం బారికేడ్లు టెంట్లు వేశారు.

ఇవీ చూడండి : మద్యం కోసం క్యూ కట్టిన మందుబాబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.