నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. బాపూజీ ఆశయాలు ఐదో తరం ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.
ఇవీచూడండి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై