నాగర్కర్నూల్ జిల్లా కోడేర్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరాతీశారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో రోడ్లు సరిగా లేకపోవటం వల్ల బస్సులు రావటం లేదని గ్రామస్థులు వాపోయారు. వేరే గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్ వెంకటస్వామి ఎమ్మెల్యేకు వివరించారు.
ఇవీచూడండి: పుర ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: అఖిలపక్షం