నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ లలితాసోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. మెుక్కలు నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని కాపాడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దిలేటి, మార్కెట్ యార్డు ఛైర్మన్ నరేందర్ రెడ్డి, తెరాస నేతలు కాటం జంబులయ్య, చంద్రశేఖర చారి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఆయురారోగ్యాలతో విరాజిల్లాలి... దేశానికి మరింత సేవచేయాలి'